కాలరే ఎత్తరా
ఉస్తాద్ భగత్‌సింగ్ మూడో పాట విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రే క్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అం దుకున్నాయి. గురువారం అభిమానుల కో లాహలం నడుమ హైదరాబాద్‌లోని మైత్రి విమ ల్ థియేటర్‌లో చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది.
భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎన ర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మి ర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ శక్తివం తమైన సాహిత్యం ఈ పాటలోని మాస్ అప్పీ ల్ను ప్రతిబింబిస్తున్నాయి.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాటలో కళ్యాణ్‌తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు రాశి. 1500 నుంచి -2000 మంది తో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్ వేసిన డ్యాన్స్ ఈ పాటకు హైలెట్’ అని చెప్పారు. కార్యక్రమంలో నిర్మాత రవిశంకర్ యలమంచిలి, కథానాయిక రాశి ఖన్నా, గీత రచయిత కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.
ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 14 న ట్రైలర్‌ను విడు దల చేయనున్నారు. మార్చి 15న భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు.




