13 March, 2026 | 5:31 AM

ఇకపై మౌనంగా ఉండను: రష్మిక

13-03-2026 12:00 AM

గత ఎనిమిదేళ్లుగా ఒక మీడియా వర్గం సామాజిక మాధ్యమాల వేదికగా తనపై అసత్యప్రచారం చేస్తున్న వారిపై నటి రష్మిక మం దన్న మండిపడింది. ప్రధానంగా కన్నడ మీ డియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ ప్లూ యెన్సర్లు హద్దులు దాటి తనపై తీవ్ర దుష్ప్రచారం చేసిన వారికి హెచ్చరిస్తూ గురువారం ఘాటైన లేఖ విడుదల చేశారు.

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు. నా వరకు అంటే ఊరుకున్నాను కానీ ఇప్పుడు నా కుటుంబీకులు వరకు కూ డా వస్తే ఇకపై మౌనం వహించేది ఉండదని తీవ్రంగా హెచ్చరించారు. 

24 గంటల సమయం ఇస్తున్నా...

‘వాళ్ల వ్యూస్, రీచ్ కోసం నేను అనని మా టల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాస్తున్నారని, అది నన్నెంతో బాధపెట్టినా నేను మౌనంగా ఉన్నాను. ఇకపై ఊరుకునేది లేదు.. తప్పుడు కథనాలను తొలగించేందు కు 24 గంటల సమయం ఇస్తున్నా.. సామాజిక మాధ్యమాల్లో నాపై పెట్టిన ఆ అసభ్యక రమైన కంటెంట్‌ను తొలగించకపోతే పరువు నష్టం దావా వేస్తానని, తన సహనాన్ని పరీక్షించవద్దని రేపటి నుంచి సంబంధిత వ్యక్తు లు, సంస్థలకు నోటీసులు జారీ చేస్తాను..

చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రష్మిక నేరుగా హెచ్చరించారు. నా జీవితం ఎలా ఉండాలో వాళ్లు ఎలా నిర్ణయిస్తారు? మన జీవితాలు మనవి, మనమే నిర్ణయాలు తీసుకోవాలి” అని రష్మి క మండిపడ్డారు. రష్మిక ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ప్ర ధాన కారణం, ఆమె 8 ఏళ్ల కిందట రక్షిత్ శెట్టి తో చేసుకున్న ఎంగేజ్మెంట్ రద్దు విషయంపై మళ్ళీ తప్పుడు వార్తలు రావడం అని తెలుస్తోంది.

ఇక ఎప్పుడో ముగిసిపోయిన వి షయాన్ని... ఒక ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ, తన క్యారెక్టర్ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్న వారిపై ఆమె విరుచుకుపడ్డారు. ఒక నటిగా విమర్శలను స్వీకరిస్తాను కానీ, వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని ఆమె వెల్లడించారు.