27 June, 2026 | 1:32 AM

ధర్మన్‌తో స్క్రీన్ పంచుకోనుందా!

27-06-2026 12:00 AM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 173వ సినిమాకు ‘ధర్మన్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రజినీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అవతారంలో కనిపించనున్నారు. కమల్‌హాసన్ తన రాజ్‌కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, యంగ్ బ్యూటీ రాశి ఖన్నా భాగమైనట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ కోలీవుడ్ వర్గాల్లో వినవస్తోంది. తాజాగా మీనాక్షి చౌదరి కూడా ఈ ప్రాజెక్టులో భాగమైందట. ప్రస్తుతం డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తమిళ స్టార్ శింబుతో ‘ఎస్‌టీఆర్51’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు ‘తలైవా 173’ కోసమూ ఈ బ్యూటీనే లాక్ చేశారని టాక్. అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.