27 June, 2026 | 1:31 AM

బాహుబలి 3 కూడా..

27-06-2026 12:00 AM

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బాహుబలి’ రెండు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చి త్రం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తాను సైతం తెలిసేలా చేసింది. ఇదిలావుంటే, ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా ‘బాహుబలి : ది టార్చ్ బేరర్’ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఒక ప్రమోషనల్ వీడియో లో రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా స్వయంగా ఒక క్రేజీ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘బాహుబలి -3’ రా బోతోందని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు. ‘మీ అందరి కోసం బాహుబలి 3 వస్తోంది’ అంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘సలార్ -2’, ‘కల్కి -2’, ‘ఫౌజీ’ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఏదేమైనా ప్రభాస్ ‘బాహుబలి- 3’ ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.