ఎంత చంపాలని చూసినా లేస్తూనే ఉండే చిత్రమిది
హర్షిత్‌రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన కొత్త సినిమా ‘దీవాన’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల విడులైంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీటీమ్ శుక్రవారం హైదరాబాద్‌లో థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. “ఇది లవ్‌స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి.
నావంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. రేపు శనివారం తెలంగాణ, ఏపీలో ప్రతి ఊరిలో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరో టికెట్ ఫ్రీ ఇస్తాం. ఈ సినిమా నచ్చకుండా ఉండదు. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యిందనిపిస్తే, నెక్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా” అన్నారు. హీరో హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ.. “దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది” అని చెప్పారు.
డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ.. “సలీం అనార్కలి’ లవ్ కంటే నాకు నా ‘దీవాన’ ఎక్కువ. ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు శ్రీదేవి కార్యంపూడి, వాసుదేవ్ కొప్పినేని, నటీనటులు నరేశ్ వీకే, రఘు కారుమంచి, సింధు, నర్సింగ్ వాడేకర్, టోనీ, కేకే, డీవోపీ వంశీ పచ్చిపులుసు, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్, ఎడిటర్ హృషికేశ్ పాస్పల్, లిరిసిస్ట్ అలరాజు తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.






