13 July, 2026 | 5:04 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్

04-04-2026 10:38 AM

యుద్ధ విమానాలను కూల్చి వేసిన ఇరాన్

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ వార్

యుద్ధంలో దూకుడు పెంచిన ఇరాన్

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)కు బిగ్ షాక్ తగిలింది. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని కాపాడగా మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండో విమానంలో ఉన్నఏకైక పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్టెక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. అమెరికాకు చెందిన ఏ 10 యుద్ధ విమానం హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిపోయింది.

గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది.  సౌదీ, కువైట్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది.  కువైట్ లోని మినా అల్- అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై(Mina Al-Ahmadi Oil Refinery) ఇరాన్ దాడి చేసింది. కువైట్ లోని చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేయడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇరాన్ లోని కర్మన్షాహ్ ప్రాంతంపై ఇజ్రాయెల్ రక్షణ దళాల దాడులు చేస్తున్నాయి. ఇరాన్ లొంగిపోకుంటే ఎత్తైన వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.  హర్మూజ్ జలసంధిని త్వరలోనే తెరుస్తామని ట్రంప్ ప్రకటన చేశారు.