14 March, 2026 | 4:14 PM

ఇరాక్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి

14-03-2026 01:08 PM

టెహ్రాన్: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ దాడులు(Iran Attacks ) చేస్తోంది. అమెరికా స్థావరాలు, ఎంబసీలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై కూడా ఇరాన్ దాడి చేసింది. అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయెలింగ్ విమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాక్ రాజధాని బాగ్దాద్(Iraq capital Baghdad)లోని అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది.ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ పై క్షిపణి పడిందని ఇరాక్ తెలిపింది.

తూర్పు ప్రాంతంవైపు దూసుకొచ్చిన ఆరు డ్రోన్లను అడ్డుకున్నామని సౌదీ ప్రకటించింది. ఇరాన్ వైమానిక దాడిని(Iran Airstrike) సమర్థంగా అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం(Government of Dubai) పేర్కొంది. ఇరాన్ మిస్సైల్ దాడిని తమ సైన్యం అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ(Ministry of Defense of Qatar) తెలిపింది. దోహోలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని నగర వాసులు పేర్కొన్నారు. ఒమన్ ఎంబసీలో అత్యవసరం కాని సిబ్బంది వెంటనే రావాలని అమెరికా సూచించింది. దౌత్య సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ ను వీడాలని అమెరికా హెచ్చరించింది. ఉత్తర ఇజ్రాయెల్ లోని గలిలీ ప్రాంతంపై రాకెట్లతో పాటు క్షిపణి దాడి జరిగింది.