లంక ప్రీమియర్ లీగ్‌కు ఐపీజీ సపోర్ట్
కొలంబో, జూన్ 16: ఐపీఎల్ తరహా లో శ్రీలంక క్రికెట్ బో ర్డు నిర్వహిస్తున్న లంక ప్రీమియర్ లీగ్ ఆరో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 10న కొత్త సీజన్ ఆరంభం కానుండగా ఈ లీగ్‌కు భారీ ఎత్తున ఆర్థిక ఊతం లభించింది. ఈ లీగ్ ప్రమోటర్లు ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ గ్రూప్ ఐపీజీ, యూనైటెడ్ ఆధారిత లిస్టెడ్ సంస్థ నుంచి కోట్లాది డాలర్ల నిధులు అందనున్నాయి.
గత కొన్ని సీజన్లుగా ఆటగాళ్లకు చెల్లింపులు ఆలస్యం, ఫ్రాంచైజీల అసంతృప్తి వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఐపీజీ గ్రూప్ రాబోయే రెండేళ్లలో ఎల్‌పీఎల్‌ను మరింత అత్యు త్తమంగా తీర్చిదిద్దేందుకు 20 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
లంక ప్రీమియర్ లీగ్‌కు ఇది పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. లీగ్ లంక క్రికెట్ యాజమాన్యంలోనే ఉన్నప్పటికీ ఐపీజీ ప్రత్యేక వాణిజ్య, మీడియా హక్కులను కలిగి ఉం టుంది. తమ నిర్ణయం లంక క్రికెట్ అభివృద్ధికి లబ్ది చేకూరుస్తుందనీ ఐపీజీ గ్లోబల్ ఫౌండర్ అనిల్ మోహన్ చెప్పారు. అలాగే మలేషియా, జింబాబ్వే టీ20 లీగ్‌లను కూడా అభివృద్ధిచేసేందుకు ఐపీజీ గ్రూప్ దీర్ఘకాలిక ప్రత్యేక ఒప్పందాలున్నాని తెలిపారు.






