నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ
17-06-2026 12:27 AM
మహిళల టీ20 ప్రపంచకప్
లీడ్స్, జూన్ 15 : ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం లీడ్స్ మైదానంలో భారత్, నెదర్లాం డ్స్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 64 పరుగుల భారీ విజయం సాధించిన టీమిండియా మంచి ఊపులో కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడనున్న నేపథ్యంలో భారత్ తన లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ లైన్-అప్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. భారత బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. డచ్ జట్టు బలమైన భారత్‌కు ఎంతవరకు పోటీనిస్తుందో చూడాలి.






