13 July, 2026 | 5:32 PM

Breaking News

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •  

రేపు ఇంటర్ ఫలితాలు

11-04-2026 12:18 AM

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : తెలంగాణ ఇంటర్మీడి యట్ విద్యార్థుల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 12న (ఆదివారం) ప్రథమ, ద్వితీ య సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పా ట్లు పూర్తిచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

కాగా తొలుత ఏప్రిల్ 11న ఫలితాలు రావచ్చని భావించినప్పటికీ, తుది ఏర్పాట్ల నేపథ్యంలో ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యా ర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ల (tgbie. cgg.gov.in)తో పాటు మొబైల్ యాప్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.

ఫలితాల్లో ఏదైనా తేడా ఉంటే రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ప్రత్యేకంగా గడువు ఇవ ్వనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈసారి రికార్డు స్థాయిలో వేగంగా ఫలితాలను వెల్లడిస్తుండటం విశేషం.