13 July, 2026 | 6:44 PM

కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు

13-07-2026 05:32 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ఎనగందల దత్తు నియోజవర్గ కళాకారుల విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక అనుబంధ విభాగం బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనగందుల దత్తు బెల్లంపల్లి పట్టణం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తి నివాసి. తన నియామకం పట్ల దత్తు కృతజ్ఞతలు తెలిపారు.