గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తైక్వాండో, కరాటే విభాగాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన జిల్లాకు చెందిన విద్యార్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరిత సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. వీరిలో కె.నవనీత్ చంద్ర, కట్కూరి త్రీనాథ్, కే.అశ్విత్ యాదవ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ... జిల్లాకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం ఎంతో గర్వకారణమన్నారు.
క్రీడల్లో సాధించిన విజయాలతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరును ప్రపంచ వేదికపై నిలబెట్టిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి విజయాలు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ఆశ్వాక్ హైమద్, ఖేలో ఇండియా కోచ్ కడతాల రాకేష్, జిల్లా కార్యదర్శి ఎం.దేవయ్య, అధ్యక్షుడు వి.రవి, క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.






