సొంత ఇల్లు కల నిజం చేసుకోండి: ఎంఈఓ నాగ్య నాయక్
20-07-2026 08:03 PM
నవాబ్‌పేట: సొంత ఇంటి కల నిజం చేసుకునేందుకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని అర్హులైన ప్రతి ఒక్కరు వారి కలలను నిజం చేసుకోవాలని ఎంఈవో నాగ్య నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ నాగ్య నాయక్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను స్వయంగా పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ ప్రగతిని అర్హుల వివరాలను అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.






