21 July, 2026 | 9:09 AM

ఓటర్లను సంప్రదించండి: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

20-07-2026 08:08 PM

మహబూబ్ నగర్ అర్బన్: ప్రతి ఓటర్లు సంప్రదించి సర్ పక్రియ పూర్తి అయ్యిందా కాకుంటే ఎందుకు కాలేదని వివరాలను తెలుసుకొని అవసరమైన సమాచారాన్ని అందజేసి ఆ ఓటర్కు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  కార్పొరేటర్లకు,  వివిధ డివిజన్ల ఇంచార్జీ లకు దిశానిర్దేశం చేశారు.  సర్ ఫారాలను నింపడం లో కొందరు ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని, వారికి మీరు అందుబాటులో ఉండి సహకరించి సహాయపడాలని సూచించారు. ఓటర్ల ఇంటికి వెళ్ళినప్పుడు  మీ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి, నోట్ చేసుకొని తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎఐసిసి నుంచి ప్రత్యేకంగా ఇంచార్జీ వచ్చారని "సర్" ప్రక్రియ పైన ఎప్పటికప్పుడు వారు మానిటరింగ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా కొడంగల్ లో రెండు రోజుల పాటు  "సర్" ప్రక్రియ కోసం  సమయం కేటాయించారని ఆయన చెప్పారు. ఎవ్వరూ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.