21 July, 2026 | 3:52 PM

దర్జాగా ఆక్రమణ... డ్రైనేజీ పైన స్లాప్

21-07-2026 08:58 AM

సమన్వయం లేని అధికారులు

ఆ మ్యాలు ముట్టాయని ఆరోపణ,?

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పీల్లి గుడ్డిదైతే... ఎలుక ఎక్కిరించింది అన్న చందాన ఉంది మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) అధికారుల తీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై ఏకంగా డ్రైనేజీ ఆక్రమణ జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. లారీ అసోసియేషన్ హాల్ ఎదురుగా తాజాగా డ్రైనేజీ పై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ర్యాంపును నిర్మించారు. అదే అదునుగా ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా ర్యాంపును అనుకొని డ్రైనేజీని ఆక్రమించి స్లాప్ వేయటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

డ్రైనేజీ పై స్లాప్ వేసుకొని వ్యాపారం నిమిత్తం వినియోగించుకునేందుకు అధికారులకు డబ్బులు ముట్టాయని ఆరోపణలు వేలు పెడుతున్నాయి. జాతీయ రహదారిపై ఆక్రమణలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటే పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ డీఈ ని వివరణ కోరగా అది తమ పరిధిలో లేదని, టౌన్ ప్లానింగ్ పరిధిలోకి వస్తుందన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ కుమార్ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల తీరు సమన్వయ లోపానికి నిదర్శనం గా మారింది.