06-02-2026 01:09:42 AM
బీసీలు, పేదలకు అన్యాయం
లెక్కలతో బయటపెట్టిన టీఆర్పీ అధ్యక్షుడు, తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి బీసీలను, మైనారిటీలను, పేదలను, పేద పిల్లల భవిష్యత్తును వ్యవస్థాపితంగా మోసం చేశాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభకు సమర్పించిన అప్రాప్రియేషన్ అకౌంట్స్ ఆధారం గా సంక్షేమ నిధుల వినియోగంలో జరిగిన మోసాన్ని మల్లన్న ప్రజలకు వివరించారు.
మైనార్టీల సంక్షేమ నిధులు
మైనారిటీలు, బీసీలకు చెందిన పేద పిల్లల చదువు కోసం కేటాయించిన నిధులను రెండు ప్రభుత్వాలు పూర్తిగా వినియోగించలేదని మల్లన్న తెలిపారు. 2014 మైనారిటీ సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 69 శాతం ఖర్చు చేయలేదు, 2018 రూ.830 కోట్లకు పైగా నిధులు మిగిల్చారు, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వందల కోట్లు వెనక్కి వెళ్లాయి అని వివరించారు. ఇది కేవలం లెక్కల తప్పిదం కాదు అని, బీసీ, మైనారిటీ పిల్లల భవిష్యత్తుపై జరిగిన దాడి అని మల్లన్న అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్లకు కేటాయించిన నిధుల్లో కూడా ఏటా పదుల కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. రోజుకు 10 గంటలు పని చేసే కార్మికుల చెమట విలువను ఈ ప్రభుత్వాలు గుర్తించలేదు అని విమర్శించారు.
పేదల సంక్షేమ బడ్జెట్, ఖర్చు
2017 కేటాయింపు: రూ.430.10 కోట్లు, ఖర్చు: రూ.384.82 కోట్లు, మిగిలిన వి: రూ.45.28 కోటు.్ల 2019 కేటా యింపు: రూ.803కోట్లు, ఖర్చు: రూ. 718.70 కోట్లు. మిగిలినవి 84.30 కోట్లు.
పెన్షన్లలో మిగులు
ఇందిరమ్మ, ఆసరా, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికుల పెన్షన్లలో మొత్తం కేటాయించిన నిధుల్లో రూ.2,300 కోట్లకు పైగా ఖర్చు చేయకుండా మిగిల్చారని, ఇది పేదల జేబులోంచి డబ్బు లాగేసినట్టే అని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద బాలికల కోసం సానిటరీ ప్యాడ్లకు కేటాయించిన నిధుల్లో ఒక ఏడాదిలోనే దాదాపు 90 శాతం డబ్బు ఖర్చు చేయలేదని తెలిపారు. 2019 20లో కేటాయింపు: రూ.44.92 కోట్లు, ఖర్చు: రూ.4.72 కోట్లు, మిగిలినవి: రూ.40.20 కోట్లు, 2018 రూ.41.51 కోట్లు ఖర్చు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో చూపించి, చివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.
2017 కేటాయింపు: రూ.2,019 కోట్లు, ఖర్చు: రూ.548 కోట్లు, మిగిలినవి: రూ.1,470 కోట్లు, 2023 కేటాయింపు: రూ.8,900 కోట్లు, ఖర్చు: సున్నా. వికలాంగుల హక్కుల చట్టం అమలు కోసం కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయలేదని మల్లన్న తెలిపారు. 2018 వికలాంగుల కార్పొరేషన్‌కు కేటాయింపు: రూ.11.75 కోట్లు, ఖర్చు: 0. 2023 వికలాంగుల కార్పొరేషన్‌కు కేటాయింపు: రూ.10.40 కోట్లు, ఖర్చు సున్నా. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను చిత్తుచిత్తుగా ఓడించి, టీఆర్పీని గెలిపించాలని కోరారు.