1 August, 2026 | 1:23 AM

ఆధార్ ఈ కేవైసీ అప్డేట్ @150!

01-08-2026 12:23 AM

న్యూ బోయిన్‌పల్లి యూనియన్ బ్యాంక్‌లో అక్రమ వసూళ్లు

ఆధార అప్డేట్‌లో ప్రభుత్వ నిబంధనలు గాలికి.. 

రేషన్ ఈ-కేవైసీకి ఆధార్ అప్డేట్ తిప్పలు

సికింద్రాబాద్, జూలై 31 (విజయక్రాంతి): ప్రభుత్వ సేవల పేరుతో జరిగే ఈ చిన్న చిన్న దోపిడీలే, సామాన్యుడికి పెద్ద భారంగా మారుతున్నాయి. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ముగుస్తుండటంతో శుక్రవారం ఆధార్ నమోదు కేంద్రాలు కిటకిటలాడాయి. ఏ ఆధార్ కేంద్రంలో చూసినా 40 నుంచి 80 మంది దర్శనమిచ్చారు.

ఓ వైపు వర్షం జల్లులు పడుతున్నప్పటికీ పలువురు తల్లిదండ్రు లు తమ పిల్లలతో పాటు ఆధార్ కేంద్రాల వద్ద నిరీక్షించి ఆధార్ అప్డేట్ క్యూలైన్లో నుంచుంటు న్నారు. మరి కొన్ని చోట్ల ఉదయం నుంచి టోకెన్లు ఇవ్వడంతో మరుసటి రోజుకు వాయి దా వేసుకోవడం గమనార్హం.

ఈ క్రమంలో అప్డేట్ పేరుతో న్యూ బోయిన్పల్లి యూనియన్ బ్యాంక్‌లో ఆధార్ అప్డేట్ సెంటర్‌పై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అన్ని అప్డేట్‌కు వచ్చే ప్రజల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆధార అప్డేట్ ఆపరే టర్ రేణుశ్రీ ను రూ.150 / ఎందుకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ఇష్టముంటే చేయించుకో, లేకపోతే వెళ్ళు అని దురుసుగా మాట్లా డుతున్నారు.

దీంతో ఆధార్ సెంటర్ ఇంచార్జ్ నరేష్ తో ఫోన్లో సంప్రదించగా ఆధార్ అప్డేట్ సెంటర్ లో రూ.150/ వసూళ్లు చేస్తున్నారని తెలియజేసిన నరేష్ నుంచి కూడా రూ.150 ఇస్తేనే పని అవుతుంది, సర్వర్ ఛార్జీలు,పేపర్ ఛార్జీలు అని ఉంటాయి. లేకపోతే వెనక్కి వె ళ్లు! సమాధానం ఇచ్చాడు.. దీంతో ఆధార్ అ ప్డేట్ కోసం వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు అ వాక్కయ్యారు.కొందరు చేసేదేమీ లేక రూ. 150 చెల్లించి అప్డేట్ చేసుకున్నారు.కానీ న్యూ  బోయిన్ పల్లి యూనియన్ బ్యాంక్ లో ఉన్న బయోమెట్రిక్  అప్డేట్ రూ.150 వసూలు చేయడం 100% అక్రమం..

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి..

 5-7 ఏళ్ల మధ్య మొదటి బయోమెట్రిక్, 15 ఏళ్ల మధ్య మొదటి,  రెండో బయోమెట్రిక్, 7-15 ఏళ్ల పిల్లలకు 30 సెప్టెంబర్ 2026 వరకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచి తం,ఆధార్ నమోదు పూర్తిగా ఉచితం. మరి ఎలాంటి అప్డేట్ కైనా గరిష్టంగా రూ.125 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదు, ఈ సెంటర్ లో ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసారు.

నిబంధన ఏం చెబుతున్నాయి..

ప్రతి ఆధార్ సెంటర్ లో ఫీజు చెల్లించే లిస్ట్ బోర్డు కనిపించేలా పెట్టాలి.ఇచ్చిన ఫీజుకి కచ్చితంగా రశీదు ఇవ్వాలి. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పైన కూడా ఎంత వసూలు చేశారో ప్రింట్ అయి ఉంటుంది. దానికి మించి అడిగితే అది చట్ట రీత్యా నేరం. 

ఆధార్ సెంటర్ ను రద్దు చేయాలి..

ఆధార్ సెంటర్ నడపడానికి ప్రభుత్వం మీకు అనుమతి ఇచ్చింది సేవలందించడానికి, అమాయక ప్రజలను దోచుకోవడానికి కాదు! అధిక ఫీజులు వసూలు చేస్తే ఆధార్ సెంటర్ లైసెన్స్ రద్దవ్వడమే కాకుండా చట్టపరంగా జైలు శిక్ష కూడా అమలు చేయాలి. దీనిపై న్యూ బోయిన్పల్లి యూనియన్ బ్యాంక్ లో ఆధార్ అప్డేట్ సెంటర్ పై యుఐడిఏఐ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారా? లేక ఇదే దోపిడీ కొనసాగు తుందా? వేచి చూడాలి...