1 August, 2026 | 1:22 AM

గడువులోగా ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ పూర్తి చేయాలి

01-08-2026 12:26 AM
  1. పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలి 
  2. ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ స్పష్టీకరణ 

మేడ్చల్, జూలై 31(విజయ క్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సెక్రటరీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. సర్ కార్యక్రమంలో మిగతా జిల్లాల కంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెనుకబడి ఉన్నందున శుక్రవారం జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఫారం ల డిజిటైజేషన్, మ్యాపింగ్ ప్రక్రియలో వెనుకబడటానికి గల కారణాలను ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ ల ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెం డు రోజుల గడువు మాత్రమే ఉన్నందున బూత్ లెవల్ ఆఫీసర్ (బి ఎల్ ఓ) లతో స మన్వయం చేసుకొని గడువు కంటే ముందే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కువగా ఫారాలు, ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ ఆర్ ఓ లు అందరూ సూపర్వైజ ర్లు, బి ఎల్ ఓ లతో మాట్లాడాలన్నారు.

కమిషన్ ఈ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు. జిల్లాలో మ్యాపింగ్ కానిది చాలా ఉన్నాయని, అందులో షిఫ్ట్ అయిన వారు ఎక్కువగా ఉన్నారని, వారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.

జిల్లాలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ లకు స్పందన ఎలా ఉందని, కాల్ చేసిన వారి సమస్య పరిష్కరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నోటీసులు జారీ చేయాల్సి ఉందని, ప్రతి నోటీసును అందించాలని, ఓటర్ల స్పందన ఈ ఆర్వోలు పరిశీలించాలని అన్నారు. 

ప్రభుత్వ భవనాల్లోనే పోలింగ్ కేంద్రాలు 

పోలింగ్ కేంద్రాలను కచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. ప్రైవేటు భవనాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ భవనాలలోకి, కమ్యూనిటీ హాల్ లకు మార్చాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేలా హేతుబద్ధీకరించాలని, ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఈఆర్వోలు నల్ల వెంకట్ రెడ్డి, సంచిత్ గంగ్వార్, పింకేష్ కుమార్, రాధిక గుప్తా, మాయాంకు సింగ్, డిఆర్‌ఓ మాలతి, ఏ ఈ ఆర్ వో లు పాల్గొన్నారు. 

క్షేత్రస్థాయిలో పరిశీలన 

సర్ ప్రక్రియను ఈసీఐ సెక్రటరీ నవీన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని తిమ్మాయిపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి లో పర్యటించి పరిశీలించారు. బిఎల్‌ఓ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.