ఉర్సులో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్ జూలై 31(విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని కాషీంబాబా దర్గా ఉర్సు ఉత్సవాల్లో మున్సిపల్ మాజి కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీంబాబా దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న సాయిపేట శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాశీంబాబా ఆశీస్సులు ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని గుండ్లపోచం పల్లి 299 డివిజన్ ప్రజల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు సాయిపేట శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, లేబర్ సెల్ నాయకులు సాయిపేట మల్లేష్, యూత్ కాంగ్రెస్ నేత వడ్డే ప్రవీణ్, గుల్బర్గా ముస్లిం పెద్దలు అజామ్ బాబా, శైపుల్లా బాబా, నాచారం హుస్సేన్, బొల్లారం సయ్యద్, అక్బర్ పాషా, షబ్బీర్, అన్వర్, జావేద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.






