calender_icon.png 6 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్‌లో ‘గ్లాస్’ పోరు

06-02-2026 01:26:35 AM

  1.   332 మందికి బీ ఫామ్స్ అందజేసిన జనసేన పార్టీ
  2. కొన్ని వార్డుల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో నిలిచింది. రాష్ట్రంలోని 2,996 వార్డులకు జనసేన పార్టీ అభ్యర్థులు 332 మంది పోటీలో ఉన్నారు. వీరికి జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  బీ ఫామ్ అందజేయడంతో ఆ పార్టీకి చెందిన ‘గ్లాస్’ గుర్తుపైన పోటీకి దిగారు. అయితే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీలోకి దిగింది.

ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 2,634 వార్డుల్లో, జనసేన 332 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కొన్ని వార్డుల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు బరిలో ఉండటంతో స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం ఉంది.

నామి నేషన్లకు ముందు, ఉపసంహరణ సమయంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తుపై నాయకుల మధ్య చర్చలు పూర్తికాకపోవడంతో జనసేన నుంచి అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్ వేశారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వీలైనంత వరకు పొత్త ధర్మం పాటించేందుకు.. మిగతా వార్డుల అభ్యర్థులు ప్రచారం చేయకుండా బీజేపీకి సహకరించేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.