అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం
07-08-2026 08:49 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డ్ శ్రీరాంనగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో భాగంగా స్థానిక 9వ కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ , అంగన్వాడీ స్కూల్ టీచర్ తుమ్మ విజయలక్ష్మి ,పిల్లల తల్లులు పాల్గొన్నారు.






