తెలంగాణ ఉద్యమకారుల సమితి కోదాడ అధ్యక్షులుగా బొలిశెట్టి కృష్ణయ్య
కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు బొలిశెట్టి కృష్ణయ్య తెలంగాణ ఉద్యమకారుల సమితి కోదాడ నియోజక వర్గ అధ్యక్షుడు గా నియమితులయ్యారు. ఈ మేరకు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తొడేటి శంకర్ గౌడ్ నియామక ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బొలిశెట్టి కృష్ణయ్య చేసిన సేవలను గుర్తించి పదవిని అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం మరింత చురుకుగా పనిచేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి కృష్ణయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సమితి రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమితి ఆశయాలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకాన్ని జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, qపలువురు ప్రజా ప్రతినిధులు, సామాజిక సంస్థల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ బొలిశెట్టి కృష్ణయ్యకు అభినందనలు తెలిపారు.






