7 August, 2026 | 9:48 PM

పార్టీ బలోపేతమే లక్ష్యం

07-08-2026 08:47 PM

- మాజీ మండల అధ్యక్షుడు నారాయణ

వాంకిడి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని వాంకిడి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణ అన్నారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్ఠానం సముచిత గుర్తింపు ఇస్తుందని తెలిపారు.

వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ అభివృద్ధికే తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. తనపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ప్రజలు ఏమాత్రం నమ్మబోరని అన్నారు. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన వారిని మండల ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రజల విశ్వాసాన్ని మరింత చూరగొంటామని తెలిపారు.