7 August, 2026 | 10:33 PM

యూఎస్పీసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

07-08-2026 09:41 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ ఆధ్వర్యంలో శుక్రవారం జాజిరెడ్డిగూడెం జెడ్పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ... సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీ మంజూరు, పెండింగ్ డీఏలు, జీవో 25 ఉపసంహరణ,317 జీవో సమస్యల పరిష్కారంతోపాటు ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.