అడవిముత్తారం పోలీసుల చాకచక్యంతో దొంగల ముఠా అరెస్ట్
– చోరీ సొత్తు స్వాధీనం
మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, యామన్‌పల్లి గ్రామంలోని తెలంగాణ వైన్స్‌లో చోరీ చేసినట్లు, అలాగే ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను దొంగిలించినట్లు నేరాన్ని అంగీకరించారు.
నిందితుల వద్ద నుండి 05 కేఫ్ లైట్ బీర్ బాటిళ్లు, 25 రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిళ్లు, నగదు రూ.5,000/-, చోరీకి వినియోగించిన స్విఫ్ట్ కారు (TS02FG3272), రెండు స్మార్ట్ ఫోన్లు మరియు హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఆస్తులతో పాటు కోర్టు ముందు హాజరుపరచేందుకు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అడవిముత్తారం ఎస్సై జి. రమేష్ తెలిపారు.






