ఆది కర్మ యోగి అభియాన్‌తో మౌలిక సదుపాయాలు
ములకలపల్లి, మే 20 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేయూత లభిస్తుందని జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ అన్నారు.
బుధవారం ఆది కర్మయోగి అభియాన్ గ్రామాలలో ఎంపికైన జగన్నాధపురం గ్రామ పంచాయతీ కేంద్రంలోని గిరిజన సొసైటీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల తరబడి ఏజెన్సీ ప్రాంతంలో వెనుకబాటుకు గురవుతున్న గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఎన్నిక చేసిన గ్రామాలలో జగన్నాధపురం ఒకటని జగన్నాధపురానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అదేవిధంగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఐకేపి సిబ్బంది గిరిజనులను చైతన్యవంతులుగా మార్చేందుకు సహకరించాలన్నారు.
గిరిజన ప్రాంతాలలో పౌష్టిక ఆహారం, పరిశుభ్రత,చదువు పెంపొందించే విధంగా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఉదయ్, తాసిల్దార్ బండి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో రామారావు, పీహెచ్సీ వైద్యులు శంకర్, అంగన్వాడి సూపర్వైజర్ నాగమణి,సెక్రటరీ ఇబ్రహీం, స్థానిక కాంగ్రెస్ నాయకులు సోయం బోడప్ప, రామాచారి,షేక్ జానీ, మరీదు నాగు, మిడియం నారాయణ, కూరం రామకృష్ణ, సురభి రాజేష్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






