21 July, 2026 | 7:45 AM

మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

20-07-2026 05:32 PM

సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధనుంజయ నాయుడు  విజ్ఞప్తి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలయినా ఇంతవరకు మున్సిపాలిటీలో ఒక్క ఇల్లు కూడా కేటాయించలేదని తక్షణమే మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ.ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారుసోమవారం నాడు పార్టీ ప్రజా సంఘాల సమావేశంలో పాల్గొన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అలవిగాని వాగ్దానాలు చేసిందని, ముఖ్యంగా పెన్షన్లు రెట్టింపు చేస్తామని,

చదువుకునే బాలికలకు ఉచిత స్కూటీలు ఇస్తావని వివాహిత మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం చేస్తామని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹10,000 ఇస్తామని, భూమి లేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, బీసీలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు బజార్ల మాదిరిగా బీసీ బజార్లు ఏర్పాటు చేసి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి కిరాయి లేకుండా చేతి వృత్తిదారులకు  దుకాణాలు కేటాయిస్తామని ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం,బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షులు చిలక రాజు శ్రీను,  సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ బత్తిని శ్రీనివాస గౌడ్ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు వాడాల భాస్కర్ ఉన్నారు.