05-02-2026 10:19:41 AM
రాజాపూర్ : గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటిదని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష అన్నారు. మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బ్యాగరి యాదమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృష్ణ, చంద్రయ్య పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, నరసింహులు, కే సత్యనారాయణ గౌడ్, బంగారి వెంకటేష్, గుర్రంగాడి యాదగిరి. గ్రామ వార్డు సభ్యులు మహమ్మద్ రహమత్ పాషా, దాచని శ్రీనివాస్ రెడ్డి, గుర్రంకాడి చెన్నయ్య,వడ్డే గోపాల్, శ్రీశైలం, ఆంజనేయులు, నరసింహులు, యాదయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.