8 July, 2026 | 2:42 AM

చర్చకు సిద్ధం!

08-07-2026 01:41 AM

కాళేశ్వరంపై అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రెడీ

  1. స్పీకర్‌కు లేఖ రాసి, డేట్ ఫిక్స్ చేయండి 
  2. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గౌరవానికి భంగం కలగనీయం.. ఆ బాధ్యత నాదే సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ 
  3. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఆర్థిక ఉగ్రవాదులు 
  4. కమీషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలు పెంచారు
  5. ఉద్దేశ పూర్వకంగానే ‘ప్రాణహిత పక్కనపెట్టారు 
  6. నిపుణులు ‘మేడిగడ్డ’ వద్దన్నా కేసీఆర్ వినలేదు
  7. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి ఆరోపణలు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించి (జాయింట్ సెషన్) కూలంకషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దం, కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేం రెడీ. స్పీకర్‌కు లేఖ రాసి.. తేదీ ఖరారు చేయండి’ అని  సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సవా ల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయ న  గౌరవానికి భంగం కలగకుండా, సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును మీకు ఎందుకు అప్పగించాలో చెబితే వారం రోజులు కాదు..ప్రాజెక్టు రీపేర్ల కోసం మూడేళ్లు అప్పగిస్తానన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై  మంగళవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు తమ తప్పును ఇతరులపై నెట్టి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆధారాలతో నివేదికలను మన ముందుంచారని తెలిపారు. వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి అందరికీ అవగాహన కల్పించిన మంత్రి ఉత్తమ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ‘ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  హయాంలో 16 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారు. వెంకటస్వామి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్లగా నామకరణం చేశారు. 

2012 మే నెలలో పృథ్వీ రాజ్ చౌహాన్ తో 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకోవాలని ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమికంగా ఒప్పందం చేసుకున్నారు. గోదావరి జలాలను తరలించి తెలంగాణను సస్యశ్యామలం చేయా లని కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నించింది. రూ. 39 వేల కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 6,150 కోట్లు ఖర్చు చేశారు . తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,523 కోట్లు ఖర్చు చేసింది.

మొత్తం రూ. 1,1670 కోట్లు ఖర్చు చేశాక కేసీఆర్ ఆలోచనలు మారాయి. ప్రాజెక్టు రీడిజైన్ కోసం అధ్యయనానికి 2015 జనవరి 21న ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కేసీఆర్ ఆలోచన తప్పు అని చెప్పింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ వద్దని నివేదిక ఇచ్చింది. కేసీఆర్‌కు నచ్చినట్టు ఇవ్వలేదని ఆ నివేదికను కేసీఆర్ పక్కన పెట్టారు.

కేసీఆర్ తనకు కావాల్సిన రిపోర్ట్‌ను వ్యాప్కోస్ సంస్థతో ఇప్పించుకున్నారు . కమీషన్ల కోసం ప్రాజెక్టు ఊరు మార్చి, పేరు మార్చి రూ. 38 వేల కోట్ల నుంచి అంచనాలు రూ. 81 వేల కోట్లకు పెంచారు.  నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు కానీ.. అంచనాలు మాత్రం పెరిగాయి ’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు

ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు

 ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషనల్  నిర్వహణ నాణ్యతేదు. తన మెదడును రంగరించి ప్రాజెక్టు డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారు . 2019 జూన్ 21 న కాళేశ్వరం ప్రారంభిస్తే ఏడాదిలోనే మేడిగడ్డ దెబ్బతిన్నదని ఇంజనీర్లు చెప్పారు. రిపేర్లు  చేయాలని ఆనాటి ఇంజనీర్ బీవీ రమణారెడ్డి 2020 మే 18న  ప్రభు త్వానికి లేఖ ఇచ్చారు.

రిపేర్లు చేయకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. గోదావరి ఉధృతితో గోడ నాణ్యత లేకపోవడం వల్ల కన్నెపల్లి పం ప్‌హౌస్ 2022 లోనే మునిగిపోయింది. ఇది ఒక్క రోజులోనే వచ్చిన సమస్య కాదు.. కట్టి న ఏడాది నుంచే ఒక్కొక్కటిగా సమస్యలు బయటపడ్డాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదు ’ అని సీఎం తెలిపారు. 

ఇసుక మేడలపై బరాజ్‌లు  

ఇసుక మేడల్లా.. కేసీఆర్ బరాజ్‌లు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ వెన్నెముక లాంటిది . వెన్నెముక పనిచేయకపోతే ఎలా ఏమీ చేయలేరో కాళేశ్వరం కూడా అంతే . కాళేశ్వరంపై చర్చకు రమ్మంటే  మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు . ప్రాజక్టు కుప్ప కూలితే ఇంజనీర్‌పై కేసు పెట్టింది బీఆఆర్‌ఎస్ హయాంలోనే. వాళ్ల హయాంలోనే ఎన్‌డీఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నాణ్యత లేకపోవడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్లే మేడిగడ్డ బరాజ్ దెబ్బతిన్నదని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఇచ్చింది.

రూ.లక్ష కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును ఎలాగైనా నిలబెట్టాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఇందుకు నిపుణులను తీసుకొచ్చి రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఒకాయన కేసీఆర్ కు ఇస్తే రెండు నెలల్లో చేస్తాం అంటున్నాడు.  కేసీఆర్ ముందు చూపుతో ఈ ప్రాజెక్టు నిర్మించారని హరీశ్‌రావు అంటున్నారు. కట్టిందే వరద జలాలు ఎత్తి పోసుకోవడానికి ఈ ప్రాజెక్టు.

వర్షాలు లేకపోయినా నీళ్లు లేకపోయినా ఎత్తి పోసుకోవచ్చు అన్నట్లు హరీశ్ రావు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురువపోతే, ప్రాజెక్టుకు వరదలు వచ్చే అవకాశం ఉండదు, మరి ఎలా నీళ్లు ఎత్తిపోస్తారు?  తొమ్మిదిన్నరేళ్లు మీకు అప్పగిస్తే రూ. 8. 21 లక్షల  కోట్లు అప్పులు చేశారు. కాళేశ్వరం పేరుతో రూ. లక్ష 2 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసిన నిర్వాహకం ఏమిటి? ’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 

మిమ్మల్ని ఉరితీయాలని ప్రజలు  కోరుకుంటున్నారు

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఆర్థిక ఉగ్రవాదులు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మేం సిద్ధం. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడొద్దు. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ప్రజా భవన్ వినియోగించడం లేదా?, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుభరోసా కొనసాగించడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ప్రజల కోసం వినియోగించే పరిస్థితి ఉంటే ఎందుకు ఉపయో  మీరు చేసిన తప్పులకు ఉరితీయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, నిబంధనలు అడ్డొస్తున్నాయి ’ అని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వివిధ సంస్థల నివే దికలను క్రోడీకరించి అవగాహన కల్పించిన  మంత్రి ఉత్తమ్‌ను సీఎం అభినందించారు.