05-02-2026 10:18:05 AM
ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ బాబు
భూత్పూర్ : మున్సిపాలిటీలకు జరుగనున్న కౌన్సిలర్లుగా గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిమితికి మించి అత్యధికంగా ఖర్చులు చేయకూడదని ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ బాబు అన్నారు. ఎన్నికల్లో ప్రచార నిమిత్తం చేసే ఖర్చు ల వివరాలు ఏ విధంగా నమోదు చేయాలో పోటీలో ఉన్న అభ్యర్థులకు భూత్పూర్ మున్సిపాలిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సు కు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చేశారు. ఈ నెల తేదీ 5,7,9 వ తేదీ లలో వ్యయo చేయు సమయంలో వ్యయాలకు సంబంధించిన వోచర్లు, బిల్లులు తీసుకోవాలన్నారు.
వాటిని రిజిస్టర్ల తనిఖీ సమయంలో అభ్యర్థి గాని అతని ఏజెంట్ గాని హాజరై వారి రిజిస్టర్ లు సంబంధిత అధికారులచే వెరిఫై చేయించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే అన్ని లావాదేవీలు చేయాలన్నారు. ఎన్నికల ఖర్చులన్నింటినీ అభ్యర్థి ఎన్నికల ప్రయోజనం కోసం తెరిచిన బ్యాంకు ఖాతా నుండి చెల్లించాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అథారిటీ ఎన్నికలు నిష్పక్ష పాతంగా నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి కె. టైటస్ పాల్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపు ఎన్నికల లో పోటీచేసిన ప్రతి అభ్యర్థి విధిగా తాము నిర్వహించిన ఎన్నికల ఖర్చుల వివరాలను సంభందించిన మునిసిపల్ కమిషనర్ లకు సమర్పించాలి లేదంటే మున్సిపల్ చట్ట ప్రకారం, ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ టీం సభ్యులు జగన్ మోహన్ రెడ్డి, మనసుర్, నంద కిశోర్ అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.