05-02-2026 11:06:20 AM
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1(Group-1 jobs) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెల్లడించారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించారు.
సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగిందని, పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవనిహైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు ఇచ్చింది. కోర్టు తీర్పుతో గ్రూప్ వన్ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.