17 June, 2026 | 2:49 AM

టార్గెట్ సిరీస్

17-06-2026 12:33 AM

ఆఫ్గనిస్థాన్‌తో రెండో వన్డే

సిరీస్ విజయంపై భారత్ కన్ను

రోహిత్‌కు గాయం ?

స్వదేశంలో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్‌ను చిత్తు చేసి, తొలి వన్డేలో సైతం ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా ఇప్పుడు రెండో వన్డే గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. యువ ఆటగాళ్ల ప్రదర్శనతో ఆప్ఘన్‌ను సునాయాసంగానే ఓడించిన భారత్‌కు ప్రత్యర్థి జట్టు ఏ మాత్రం పోటీనిస్తుందనేది వేచి చూడాలి.

లక్నో, జూన్ 16: సొంతగడ్డపై ఆఫ్గనిస్థాన్ తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో ఏక్ నా క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం ఇరు జట్లు తలపడబోతున్నాయి. బ్యాటింగ్‌లో శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, రాణించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ అందుకోవాల్సి ఉండగా.. మిగిలిన బ్యాటర్లకు అవకాశం రాలేదు. 195 పరుగుల టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించింది.

ఆ మ్యాచ్‌తో అరంగే ట్రం చేసిన గుర్నూర్ బ్రార్, హర్ష దూబే ఆకట్టుకున్నారు. కీలక వికెట్లు పడగొట్టి తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు, హర్ష దూబే 3 వికెట్లు పడగొట్టారు. మిగిలిన బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్జి కూడా రాణించారు. సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీ మిండియా తుది జట్టులో మార్పు లు చేయకపోవచ్చు. అయితే ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ గాయపడడం టెన్షన్ పెడుతోంది. మణికట్టు గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్‌మ్యాన్‌ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి.

ఒకవేళ రోహిత్‌ను తప్పిస్తే జైస్వాల్ తుది జట్టులోకి వస్తా డు. ఈ మ్యాచ్‌తోనే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోం ది. తర్వాత చివరి వన్డేలో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. మరోవైపు తొలి వన్డేలో ఆప్ఘన్ బ్యాటింగ్‌కు సంబంధించి గుర్బాజ్ సెంచరీ బాదేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడి శతకం సాధించా డు. అతని విధ్వంసం కారణంగానే ఆప్ఘనిస్థాన్ ఏ స్కోరు 150 దాటగలిగింది. దీంతో మిగిలిన బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది.

నబీ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఫామ్ అందుకోవాలి. అటు బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌పై అంచనాలున్నాయి. తొలి వన్డేలో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఆప్ఘన్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఏక్ నా స్టేడియం బ్యాటర్లకు, బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నా రు. 280 ప్లస్ స్కోరు చేస్తే కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

తుది జట్ల అంచనా

భారత్ : గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ/జైస్వాల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష దూబే, గుర్నూర్ బ్రార్, అర్షదీప్‌సింగ్, ప్రసిద్ధకృష్ణ

ఆప్ఘనిస్థాన్ : గుర్బాజ్, జడ్రాన్, సెదికుల్లా, హస్మతుల్లా షాహిది(కెప్టెన్), రహమత్ షా, ఒమర్జాయ్, నబీ, రషీద్‌ఖాన్, మహ్మద్ సలీమ్, ఘజన్‌ఫర్, రహమాన్