17 June, 2026 | 1:14 AM

ఓడితే ఇంటికే

17-06-2026 12:29 AM

భారత్ ఏ కీలకపోరు

దంబుల్లా, జూన్ 15: శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత్ ఏ జట్టు కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ ఏ జట్టుతో తలపడనుంది. శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమితో భారత్ ఏ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

మూడు మ్యాచ్‌లలో రెండింట ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో ఇండియా- ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి.