25 June, 2026 | 4:41 AM

ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు

25-06-2026 12:00 AM

కాంగ్రెస్ నేతపై బిఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం

నంగునూరు, జూన్ 24: సిద్దిపేట ఎమ్మె ల్యే హరీష్ రావుపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకుడు దేవులపల్లి యాద గిరి చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నంగునూ రు బిఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశం లో ఉమ్మడి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య,మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేయ డం వేరని, వ్యక్తిగత దూషణలకు దిగడం యాదగిరి సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు.

హరీష్ రావు వల్లనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పొంది,ఇప్పుడు ఆయననే విమర్శించడం కృతజ్ఞత లేనితనమని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపో తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఘటనపై యాద గిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట సీపీకి,రాజగోపాలపేట పోలీసులకు బిఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ స మావేశంలో మండల నాయకులు ఎడ్ల సో మి రెడ్డి, రమేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కిష్టారె డ్డి, సర్పంచులు పోచయ్య, సాయిలు నాయకులు నర్సింగ్ రావు, కన్నయ్య తదితరులు ఉన్నారు.