ఈ వారం వార్తల్లో..
కీర్ కిరికిరికి రాం.. రాం!
అధికార పార్టీ లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల తన పదవికి ఇటీవల రాజీనామా చేశారు. ఆయన నాయకత్వంపై సొంత పార్టీ ఎంపీలు నమ్మకం కోల్పోయారు. చివరకు పార్లమెంట్‌లో సొంత పక్షం మద్దతును కోల్పోయే పరిస్థితి వచ్చింది. అయితే.. సెప్టెంబర్‌లో కొత్త ప్రధాని బాధ్యతలు స్వీకరించే వరకూ ఆయనే ప్రధానిగా కొనసాగనున్నారు.
మహా కథన ‘భాగ్యరాజా’ !
దర్శకుడు భాగ్యరాజా సినిమాల్లో సాంకేతిక హంగులు, ఆర్భాటాలు ఉండవు. విజిల్ కొట్టించే మాస్ సీన్లు, ఎలివేషన్లు ఉండవు. కథానాయకుడి బూట్ కట్ షాట్లు ఉండవు. ప్రేమ, త్యాగం, నైతికత, మానసిక సంఘర్షణల మేళవింపుతోనే ఆయన కథలుంటాయి. ఆయన చిత్రాల్లో కథే పెద్ద బలం. కథనమే ప్రత్యేక ఆకర్షణ. అందుకే.. ఆయన కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. భౌతికంగా ఆయన నిష్క్రమణ సినీ ప్రపంచానికి తీరని లోటు.






