చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
భువనేశ్వర్: ఒడియా, బెంగాలీ చలనచిత్ర రంగాలకు విశేష సేవలందించిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ దిలీప్ రే(Veteran Odia Cinematographer Dillip Ray Passes Away ), స్వల్ప అనారోగ్యంతో భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. 72 ఏళ్ల రే శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాయ్ మృతి పట్ల ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సంతాపం వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర సాంస్కృతిక, కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దిలీప్ రే మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
73 ఏళ్ల భాగ్యరాజ్ గుండెపోటుతో మృతి
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్( K Bhagyaraj passed away) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కె. భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ తన కెరీర్ లో 75 సినిమాల్లో నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇండియన్ సినిమాలో 'కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే'గా(King of Screenplay) భాగ్యరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కె. భాగ్యరాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు






