ఈ వారం వార్తల్లో..
జెంటిల్‌మేన్ పోలీస్.. దొర!
ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మరణం తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలకు తీరని లోటు. నిబద్ధత గల అధికారిగా, గొప్ప వ్యూహకర్తగా పేర్గాంచిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. వామపక్ష తీవ్రవాద అణచివేతలో ఆయన అనుసరించిన వినూత్నమైన వ్యూహాలు, పోలీస్ వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.
వివాదంలో కావ్యా మారన్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ డొమెస్టిక్ లీగ్ హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్‌ను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. హండ్రెడ్ లీగ్‌లో పాక్ ప్లేయర్స్ ఆడటంపై ఎలాంటి ఆంక్షలు లేకున్నా భారత్‌కు చెందిన కావ్యా మారన్ ఆ దేశపు క్రికెటర్‌ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.




