30 July, 2026 | 2:22 AM

రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ఉంటారు

30-07-2026 01:45 AM

నాగిరెడ్డిపేట్, జూలై 29 (విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో బేటీ బచావో - బేటి పడవో కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజం, దేశ అభివృద్ధిలో, కుటుంబము అభివృద్ధిలో ఆడ పిల్లల పాత్ర, మరియు ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యంత శక్తీవంతులైన మహిళల గురించి చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో మహిళలే అన్నీ రంగాలలో ఉంటారని ఆశభావం వ్యక్తం చేయడం జరిగింది. పురిటి లోనే ఆడపిల్లలను స్కానింగ్ చేసి గుర్తించడం చట్టరీత్యా నేరం అని తెలుపడం జరిగింది.

మహిళా సాధికారతలో భాగంగా మహిళల రక్షణ, సంక్షేమం, అవసరాల దృష్ట అవసరం అయ్యే ప్రభుత్వ ఉచిత నెంబర్ గ్రామ మహిళలకు తెలుపడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలోనే బాలికల నిష్పత్తిలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నందుకు అందరూ సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమ యాదగౌడ్, ఉప సర్పంచ్ అభిషేక్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటి కిష్టయ్య,  నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఐకెపి ఏపిఎం దత్తు, ఏపీవో సక్కుబాయి,కార్యదర్శి కార్తీక్,వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొనడం జరిగింది.