3 July, 2026 | 2:28 PM

మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా లకావత్ వెంకట్ బాధ్యతల స్వీకారం

03-07-2026 01:27 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ లకావత్ వెంకట్ (ఆర్థో) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నూతన ప్రిన్సిపల్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్లు తదితరులు పాల్గొన్నారు.