ఇల్లందు ఏరియాలో పర్యటించిన డైరెక్టర్(పీపీ)
ఇల్లెందు/టేకులపల్లి, మే 3, (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (పి. పి.) కే వెంకటేశ్వర్లు, ఆదివారం ఇల్లందు ఏరియా కోయగూడెం ఓ.సి.లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన కే.ఓ.సి. వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్య ను అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్ (పి. పి) కే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమి౦చాలని అన్నారు తరువాత ఇల్లందు ఏరియా లోని జి.యం కార్యాలయంలో జెకె-5ఓసీ, నూతన జే కే కోల్ మైన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన రికారడ్స్ పరిశీలించి రివ్యూ చేపట్టారు. నూతన ఓ.సి కి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఏరియా జి.యం వి.కృష్ణయ్యని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యస్వో టు జియం రామస్వామి, పి.ఓ కే.ఓ.సి. గోవిందరావు, జే.కే.పి.ఓ. జాకీర్ హుస్సేన్, డీజిఎం పర్సనల్ అజ్మీర తుకారాం, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సి.ఆర్.బి. ప్రసాద్ రావు, డిజియం ఐ ఈ డి ప్రభాకర్, డీజిఎం (సివిల్) రవి కుమార్, డీజీఎం (యఫ్ & ఏ) నాగలక్ష్మి కే.ఓ.సి మేనేజర్ శ్రీనివాస రావు, జే.కే మేనేజర్ పి.పూర్ణచందర్, క్వాలిటీ మేనేజర్ రామదాసు, సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.






