మల్లాపూర్‌లో ఇఫ్తార్ విందు
పాల్గొన్న పీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి
బడంగ్పేట్, మార్చి 18 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మల్లాపూర్లోని వై ఏ ఆర్ కన్వెన్షన్లో జల్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ బామ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ కార్యదర్శి ఏలిమెటి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రంజాన్ పండుగ సమాజంలో ఐక్యతకు, సహనానికి మరియు సేవా భావానికి నిదర్శనమని అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
అందరూసోదరభావంతో మెలగడం సమాజ అభివృద్ధికి అవసరమని ఆయన తెలిపారు.మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, వారికి పవిత్ర రమజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో అహ్మద్ బామ్, మహమ్మద్ ఖాద్రి, జహంగీర్, వలి, భాను, వంగేటి మధుసూదన్ రెడ్డి, రాజేష్ ఠాకూర్, ఆంజనేయులు మరియు పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.




