3 June, 2026 | 2:40 AM

అపరిచిత వ్యక్తులు, అనుమాదాస్పద వస్తువులు కనిపిస్తే ఫిర్యాదు చేయండి

03-06-2026 01:31 AM

జవహర్ నగర్, జూన్ 2 (విజయక్రాంతి): అపరిచిత వ్యక్తులుఅనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే తెలియపరచాలని తద్వారా నేరస్తుల కదలికలు శాంతి భద్రతల పర్యవేక్షణ సులువు అవుతుందని జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి కాలనీ భద్రతపై డబల్ బెడ్ రూమ్ వాసులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జవహర్ నగర్ పోలీస్ సిబ్బంది కృషి అభినందనీయమని జవహర్ నగర్ లోని సమస్యాత్మక ప్రాంతాలలో గంజాయి సేవించే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. యువత మత్తుకు బానిస కావద్దని సరైన మార్గంలో పయనించి రాష్ట్రానికి తద్వారా దేశానికి పేరు తేవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్‌ఐ రాము నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.