3 June, 2026 | 2:39 AM

సంక్షేమం, అభివృద్ధి.. సమ ప్రాధాన్యం

03-06-2026 01:29 AM

* పుట్టుక నీది.. చావు నీది, బతుకంతా దేశానిది.. అన్న ప్రజాకవి కాళోజీ మాటలే మాకు స్ఫూర్తి.

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  1. తెలంగాణ విజన్-2047 లక్ష్యం దిశగా వెళ్తున్నాం
  2. అద్దె ఇళ్ల నుంచి పేదలకు విముక్తి 
  3. వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా కర్షకులు
  4. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ  
  5. మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రణాళికలు
  6. రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  7. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి) : ‘సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోంది. రెండున్నర ఏళ్లలో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం. తెలంగాణ విజన్ -2047 లక్ష్యం సాధించే దిశగా ముందుకెళ్తు న్నాం’. అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారం ఎవ్వరికీ శాశ్వ తం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

సికిం ద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినో త్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘంగా జరిగిన ఉద్యమంలో ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాలు, తెగువకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపట్టి భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భమే జూన్ 2వ తేదీ అని, తెలంగాణ కోటి రత్నాలవీణ అని అన్నారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ మా టలను సీఎం గుర్తు చేశారు. కాళోజీ స్ఫూర్తి తో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం శ్రమిస్తున్నట్లు చెప్పారు.

రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహిం చదని, ప్రభుత్వం అంటే నలుగురి చేతిఓ ఉండే పెత్తనం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మ న్మోహన్‌సింగ్, సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

మన పథకాలు మరెక్కడా లేవు..

సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని,  అధి కారంలోకి వచ్చిన 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతం అయ్యా మన్నారు.

రైతులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రుణాలను ఒకే దఫా రూ.2 లక్షలు మాఫీ చేసి రుణ విముక్తి కల్పించామని చెప్పారు. తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేసి, దాదాపు 25 లక్షల మందిని రుణ విముక్తులను చేశామని వివరించారు. 

సౌరశక్తితో నడిచే పంప్‌సెట్లు..

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, సౌరశక్తితో నడిచే పంప్‌సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ.27,529 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని వివరించారు. పెట్టుబడి సాయం కోసం గత ఏడాది వానాకాలం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8,744 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు.

ఈ ఏడాది ఇప్పటికే రూ.5,700 కోట్లు రైతుభరోసా నిధులను నేరుగా రైతు ఖాతాల్లో జమచేశామని, ఇది అన్నదాతల పట్ల మా చిత్తశుద్ధికి, వ్యవసాయం పట్ల మా ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. 2025- -26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతుల పంటలు చివరి గింజ వరకు కొనేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు రూ.11,300 కోట్లు జమ చేశామన్నారు. 

‘తుమ్మిడిహట్టి’ని పూర్తిచేస్తాం..

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మళ్లీ కృషి చేస్తున్నామని, పూర్తి చేసి తీరుతామని చెప్పారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని, దీనికి మరమ్మతులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

మహిళలకు రూ.60 వేల కోట్లు..

మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలు  దేశ పారిశ్రామికరంగంలో కీలకంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 

67,763 ఉద్యోగాలు భర్తీ..

న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. అత్యం త పారదర్శకంగా 67,763  ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఈ నెలలో టీజీపీఎస్సీ ద్వారా మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్, పీసీబీ, అట వీ శాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నట్లు వివరిం చారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చా రు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ద్వారా విద్యావ్యవస్థ మరి బలోపేతం కానుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,362 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించామని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేశామని సీఎం పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకోసం రూ.22 వేల కోట్లు ఖర్చు..

పేదల ఇండ్ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఈ సారి క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తామని సీఎం చెప్పారు.