పాముకాటుకు గురైన ఉపాధి హామి కూలీ
03-06-2026 01:32 AM
బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స
బాన్సువాడ, జూన్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన హనుమవ్వ అనే మహిళకు ప్రమాదవశాత్తు పాము కాటుకు గురి కావడంతో తోటి కూలీలు హుటాహుటిన చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం హనుమవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ కూలీ పనులకు వెళ్లిన సమయంలో అందుబాటులో లేడని ఆసుపత్రికి తోటి కూలీలు తరలించారని ఇప్పటివరకు ఫీల్ అసిస్టెంట్ రాలేదని బాధితురాలు పేర్కొన్నారు.






