మత్తుకు బానిసైతే కుటుంబం చిత్తే
15-05-2026 01:25 AM
కుబీర్‌మే14 (విజయ క్రాంతి)సమాజంలో మత్తు పదార్థాలకు బానిసలైన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వాటికి దూరంగా ఉండాలని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు గంజాగస్తి మత్తు పదార్థాల నియంత్రణ అనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. గంజాయి మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించారు. మత్తు సేవించిన విక్రయించిన రవాణాకు సహకరించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్రలు సిఐలు పాల్గొన్నారు.






