15 May, 2026 | 2:51 AM

డీజీపీని కలిసిన వరంగల్ సీపీ

15-05-2026 01:25 AM

వరంగల్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీజీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరు సంబందించిన వివరాలను డీజీపీ వరంగల్ సీపీని అడిగి తెలుసుకున్నారు.

అంకితభావంతో పనిచేయాలి

  • వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ 

వరంగల్, మే 14 (విజయక్రాంతి): అధికారులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ ఆదేశాల మేరకు హసన్ పర్తి, కాజీపేట పోలీస్ స్టేషన్ల నూతన ఇన్స్ స్పెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్లు మహేందర్, శ్యాంసుందర్ గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను సిపి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజే శారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని బాధితులకు కలిగించా లని  పోలీస్ కమిషనర్ నూతన ఇన్స్ స్పెక్టర్ల కు దిశా నిర్దేశం చేశారు.