15 May, 2026 | 2:41 AM

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

15-05-2026 01:23 AM

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ద్వారా పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నట్లు చెప్పారు. రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించిన చెప్పారు.