5 August, 2026 | 4:40 AM

ఫోన్ కాల్ ద్వారా ఓటర్లను గుర్తించండి

05-08-2026 01:04 AM

మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కేఎల్ అర్ పిలుపు

మహేశ్వరం, అగస్టు 4(విజయక్రాంతి): తెలంగాణలో ఆగస్టు 10తో ముగియనున్న ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ (సర్ ) కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించాలని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మహేష్ రావు నియోజకవర్గం ముఖ్య నాయకులతో కలిసి అని మాట్లాడారు. నియోజకవర్గంలో సర్ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా  షిఫ్టింగ్ ఓట్లు, మరణిం చిన వారి పేర్లు మరియు దొంగ ఓట్లను ప క్కాగా గుర్తించి తొలగించాలని బీ ఎల్ ఏ లు,

బూత్ అధ్యక్షులను ఆదేశించారు. చిరునామా దొరకని ఓటర్ల వివరాలను పొరుగు వారు లేదా గ్రామస్తుల సహాయంతో సేకరిం చి, ఫోన్ కాల్స్ చేసి ఎన్యుమరేషన్ ఫారమ్స్ పూర్తి చేయించాలని సూచించారు.రెండు ఓట్లు లేదా దొంగ ఓట్లు కలిగి ఉంటే చట్టప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆగస్టు 10 నాటికి అర్హులైన ఓటర్లందరూ తమ వివరాలను నమోదు చేసుకొని అప్డేట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.