‘సర్’పై రాజకీయ పార్టీలతో సమీక్ష
05-08-2026 01:02 AM
చేవెళ్ళ, ఆగష్టు 4 (విజయక్రాంతి): చేవెళ్ల ఆర్ డిఓ పార్థసారథి SIR పై రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వివిధ పార్టీల తరుపున ప్రతినిధులు హాజరైయ్యరు. ప్రతినిధులకు సమీక్షలో సర్ ప్రా ముఖ్యతను వివరించారు.
చనిపోయిన, వలస పోయిన ఓటర్లు రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేయించుకున్న వారి డబుల్ ఓట్ల తొలగింపు, యువజనులకు ఓటు హక్కు కల్పించడం, అడ్రస్ మార్పు చేర్పులపై సమీక్షలో చర్చించారు. ఓట్ల తొలగింపుపై ప్రతినిధులకు ఉన్న సందేహాలకు సమాధానమిస్తూ.. సందేహాలను నివృత్తి చేశారు. మున్సిపల్, మండలంలోని వివిధ గ్రామా ల్లో ఓటర్లకు సర్ పారాల పంపిణి చేసిన విధానం తెలిపారు. పార్టీల తరఫున హాజరైన ప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు.






