13 July, 2026 | 3:45 PM

మెదక్‌లో విషాదం: పాముకాటుతో 9 ఏళ్ల బాలిక మృతి

13-07-2026 02:26 PM

మలుపల్లి : మెదక్‌లో సోమవారం పాము కాటుకు(Snakebite) గురై తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం మలుపల్లి గ్రామంలో జరిగింది. సమాచారం ప్రకారం, రాత్రి వేళ హారిక అనే బాలికను, ఆమె తల్లి లావణ్యను పాము కాటు వేసింది. పాము కాటుకు గురైన హారిక మరణించగా, ఆమె తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.